Sunday, September 14, 2025
E-PAPER
Homeసినిమాఅద్భుత విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

అద్భుత విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -

”మిరాయ్‌’ని గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకి ధన్యవాదాలు. ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా చూసిన ఆడియన్స్‌ సపరేట్‌గా రీల్స్‌ చేస్తూ, ఈ సినిమా గురించి ప్రమోట్‌ చేస్తుంటే మరింత ఆనందంగా ఉంది’ అని హీరో తేజ సజ్జా అన్నారు. హీరో తేజ సజ్జా నటంచిన పాన్‌ ఇండియా చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకుని, అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన థ్యాంక్యూ మీట్‌లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ,’ డైరెక్టర్‌ కార్తీక్‌, నిర్మాత విశ్వప్రసాద్‌ గారి వల్లే ఈ సినిమా సాధ్యమైంది.

మనోజ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో మరో స్థాయికి వెళ్ళింది. మా గోల్డెన్‌ హార్ట్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కి, రానాకి కృతజ్ఞతలు. సినిమా బిగినింగ్‌లో ప్రభాస్‌ ఈ కథని నెరేట్‌ చేయడం వల్లే ఈ కథకు సినిమాకి మంచి వెయిటేజ్‌ వచ్చింది’ అని అన్నారు. ‘దాదాపు12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్‌ మోగుతూనే ఉంది. నాకు ఇదంతా కలలా ఉంది. ఈ కథలో నన్ను భాగం చేసినందుకు డైరెక్టర్‌ కార్తీక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్‌ ప్యాషన్‌కి హ్యాట్సప్‌. అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు’ అని మంచు మనోజ్‌ చెప్పారు. ‘నన్ను బిలీవ్‌ చేసిన నిర్మాత విశ్వప్రసాద్‌, హీరో తేజకి థ్యాంక్స్‌. మనోజ్‌తో ట్రావెల్‌ మ్యాజికల్‌ ఎక్స్‌పీరియన్స్‌. రైటింగ్‌ సైడ్‌ మణి నాతో మూడేళ్లు పాటుగా ఉన్నారు. ఈరోజు ఆడియన్స్‌ అనుభూతి చెందుతున్న మూమెంట్స్‌ అన్నీ ఆయన రైటింగ్‌ నుంచి వచ్చినవే. హరి ఈ సినిమాకి గ్రేట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. రానా నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్‌ చేస్తున్నారు’ అని డైరెక్టర్‌ కార్తీక్‌ చెప్పారు.

‘మిరాయ్‌’ లాంటి అద్భుతమైన విజయం మాకు మరెన్నో సినిమాలు చేసే గొప్ప ఎనర్జీ ఇచ్చింది. కార్తీక్‌ కథ చెప్పినప్పుడే తేజ లాంటి కమిట్‌మెంట్‌ ఉన్న హీరోతో చేయాలని అనుకున్నాం. గౌర హరి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. మా నెక్స్ట్‌ నాలుగు సినిమాలు కూడా ఆయనే మ్యూజిక్‌ చేస్తున్నారు. రానా మాకు ఎంతో సపోర్ట్‌ చేశారు. హిందీలో రిలీజ్‌ చేయడానికి చాలా ఎంకరేజ్‌ చేశారు. అద్భుతమైన విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేసిన మా టీంకి, మా సినిమాని తీసుకున్న పంపిణీదారులకు థ్యాంక్స్‌. మా అమ్మాయి కృతి ప్రసాద్‌ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా జర్నీ మొదలుపెట్టి ఈ సినిమాతో నిర్మాతగా మారింది. తను మా లక్కీ ఛార్జ్‌.

  • నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -