Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దివ్యాంగుల వివాహక ప్రోత్సాహానికి జీఓ జారీపై సీఎంకు కృతజ్ఞతలు

దివ్యాంగుల వివాహక ప్రోత్సాహానికి జీఓ జారీపై సీఎంకు కృతజ్ఞతలు

- Advertisement -

– విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ 
నవతెలంగాణ –  కామారెడ్డి 

దివ్యాంగులు – దివ్యాంగులు (స్త్రీ–పురుషులు) వివాహం చేసుకున్న వారికి రూ.2 లక్షల వివాహక ప్రోత్సాహం మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేయడంపై ముఖ్యమంత్రి కి విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో దివ్యాంగులు, సకలాంగులు వివాహం చేసుకున్న వారికి మాత్రమే రూ.1 లక్ష ప్రోత్సాహకం ఉండేదని, దివ్యాంగులు దివ్యాంగులు వివాహాలకు ఈ అవకాశం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. 2019 నుంచి దివ్యాంగులు,  దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికీ ఈ ప్రోత్సాహం వర్తింపజేయాలని ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరారు.

ఈ అంశాన్ని గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన ఎవరు స్పందించలేరని, ప్రస్తుతం ముఖ్యమంత్రి  దృష్టికి  తీసుకెళ్లామని తెలిపారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహాలు చేసుకోవడానికి ఇది స్పూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.  ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ దివ్యాంగుల పెన్షన్ పెంపు, ఉచిత రవాణా సౌకర్యం, ఉద్యోగాల భర్తీ, ఉన్నత ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, 2016 దివ్యాంగుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల పరికరాలు, ఉపకార వేతనాలు ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నితిశ్ రెడ్డి, గాడి నర్సింలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -