Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాఘవపురం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు

రాఘవపురం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు

- Advertisement -

పార్టీ నుండి ముగ్గురు సస్పెండ్ : మమతా-సంతోష్, సర్పంచ్ మరియు గ్రామ శాఖ
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం రాఘవపురం గ్రామంలో మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య సర్పంచ్ పదవి కోసం జరిగిన హోరాహోరి పోటీలో బిఆర్ ఎస్ పార్టీకి చెందిన పరిదే మమత-సంతోష్ ను గెలిపించడం పట్ల ఆ పార్టీ సోమవారం సమావేశమై గ్రామ శాఖ, పరిదే మమత సంతోష్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఆరే రాములు, ఆరే పాండు, కరిక మల్లేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా పనిచేసినట్లు పార్టీ దృష్టికి రావడంతో వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కమిటీ తీర్మానించింది అని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీతో వీరికి ఎలాంటి సంబంధం లేదని, బీఆర్ఎస్ గ్రామ శాఖ కమిటీ తెలిపింది. అనంతరం సర్పంచ్ ను ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను ఘనంగా శాలువాలు పూలమాలతో బిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం సర్పంచ్ మమత మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన సర్పంచ్ పదవిని స్వార్థానికి కాకుండా గ్రామ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, గ్రామ శాఖ కరికి మల్లేష్, మాజీ సర్పంచ్ బక్క రాములు, సీనియర్ నాయకులు అరె బాలరాజు, శీలం రాంరెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -