Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్7వ వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు 

7వ వార్డ్ ప్రజలకు కృతజ్ఞతలు 

- Advertisement -

7 వ వార్డ్  కౌన్సిలర్ కోడి సుష్మ వెంకన్న 
నవతెలంగాణ – చండూరు

చండూర్ పట్టణ పురపాలక సంఘ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోడి సుష్మ వెంకన్న ఘనవిజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఓటరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనను విశ్వసించి ఓటు వేసిన వారికే కాకుండా, ఓటు వేయని వారికీ కూడా కృతజ్ఞతలు అని తెలిపారు. 7వ వార్డు అభివృద్దే నా లక్ష్యం. ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

వార్డులో మౌలిక  వసతుల అభివృద్ధి, పారిశు ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మెరుగుదల వంటి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఎన్నికలు. ఫలితమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -