కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి
నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లె ప్రజలు, మున్సిపల్, ఎన్నికల్లో పట్నం ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్నం ప్రజలు ప్రజా ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాం అని అన్నారు.
బీఆర్ఎస్ అహంకారానికి, బీజేపీ మతోన్మాదానికి, కాంగ్రెస్ సెక్యూలరిజం, అభివృద్ధి నినాదానికి మధ్య జరిగిన ఎన్నికల్లో మీరంతా సరైన తీర్పును ఇచ్చారని, ప్రతిపక్షాలు.. ఎన్నికల కోసం ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి, విభజించి లబ్ది పొందాలని చూసినా పట్టించుకోలేదని అన్నారు. ప్రజలు, కల్మషం లేనివాళ్లు, అన్ని వర్గాలు కలిసి మెలసి ఉండాలి అనుకునే వాళ్లు, అందుకే విపక్షాలు విభజన పాలిటిక్స్ చేసినా మేమంతా ఒక్కటేనని నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వాదించి గెలిపించి, అభివృద్ధికి అండగా నిలిచిన ప్రజలకు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషులు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు, నాయకులకు, ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


