ప్రేమికుల దినోత్సవం కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫంకీ’ చిత్రం థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. కానీ నేను ఈ సినిమా విడుదలకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఉదయం శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. అందరూ థియేటర్‌లో ఎంతగానో ఎంజాయ్ చేశారు. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా అనుదీప్ ఈ సినిమాని తెరకెక్కించాడు.
ఈ చిత్రం నాకెంతో ఊరటనిచ్చింది. అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినీ ప్రయాణంలో ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు. ‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాము. ప్రేక్షకులు ప్రతి జోక్‌ని ఎంజాయ్ చేస్తూ, నవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు’ అని కథానాయిక కయాదు లోహర్ చెప్పారు. దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ,’సినిమాలో కామెడీతో పాటు ప్రేమ కథ, భావోద్వేగాలు కూడా బాగా పండాయి’ అని తెలిపారు. ‘రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుందని ముందునుంచీ చెబుతూ వచ్చాము. మా నమ్మకం నిజమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



