Tuesday, March 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాక్‌కు కృతజ్ఞతలు

ఇరాక్‌కు కృతజ్ఞతలు

- Advertisement -

మొజ్త్తాబా ఖమేనీ

టెహ్రాన్‌: ఇరాన్‌పై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినందుకు ఇరాక్‌ ప్రజలకు, మత నాయకత్వానికి ఇరాన్‌ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక సందేశం పంపారు. ఈ వార్తను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా నివేదించింది, కానీ ఆ సందేశం ఏ రూపంలో పంపబడిందో స్పష్టంగా పేర్కొనలేదు. మాజీ సర్వోన్నత నాయకుడు అయ తోల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత అధికారం చేపట్టిన మొజ్తబా హత్యకు గురయ్యారని అమెరికా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాగ్దాద్‌లోని ఇరాన్‌ రాయబారికి, ఇరాక్‌లోని ఇస్లామిక్‌ సుప్రీం కౌన్సి ల్‌కు మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ సందేశం విడుదలైంది.ఇదిలా ఉండగా, మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం, ఆయన బతికే ఉన్నారా లేదా అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు తీవ్రమవుతున్నాయి.

దాడులు జరిగినప్పటి నుండి మొజ్తబా ఇంకా బహిరంగంగా కనిపించకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సర్వోన్నత నాయకుడు హత్యకు గురయ్యారని లేదా విషమ పరిస్థితిలో ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొన్న ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ మీడియా ద్వారా కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదలవుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన సైనిక చర్యలో అలీ ఖమేనీ హతమయ్యారు. దేశం ఒక పెద్ద రాజకీయ సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఆయన వారసుడిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 9న మొజ్తబా సుప్రీం లీడర్‌గా ఆమోదం పొందారు. మార్చి 11న జరిగిన దాడిలో ఆయన హతమయ్యారని అమెరికా వాదిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -