– టీజీఈజేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరించినందుకు ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. టీజీఈజేఏసీ నిరంతర కృషితో 12 సంవత్సరాల తర్వాత కౌన్సిల్‌ను పునరుద్ధరించిందని వారు తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు గత పదేళ్లలో సాధించని వాటిని తాము ఒక్కొక్కటిగా సాధిస్తున్నామన్నారు. ఈ సమయంలో ప్రభుత్వానికీ, తమకు మధ్య చిచ్చుపెట్టొద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో టీజీఈజేఏసీ చైర్మెన్ ఏలూరి శ్రీనివాసరావు, సెక్రెటరీ జనరల్, దామోదర్ రెడ్డి, కో చైర్మెన్ చావ రవి, నాయకులు ఎ.సత్యనారాయణ, ముజీబ్ హుస్సేన్, కస్తూరి వెంకటేశ్వర్లు, బి.శ్యామ్, కృష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, శ్రీనేష్, డాక్టర్ శ్రీరామ్ రెడ్డి, శ్రీకాంత్, హరికృష్ణ, లక్ష్మణ్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES