Sunday, October 19, 2025
E-PAPER
Homeఆటలుపసిడి పోరుకు తన్వీ

పసిడి పోరుకు తన్వీ

- Advertisement -

ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌
సెమీస్‌లో చైనా షట్లర్‌పై గెలుపు

గువహటి : భారత బ్యాడ్మింటన్‌లో యువ రాకెట్‌ తన్వీ శర్మ (16) మరో చరిత్ర సష్టించింది. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో సైనా నెహ్వాల్‌ (2008) తర్వాత సింగిల్స్‌ విభాగంలో పతకం సాధించనున్న తొలి షట్లర్‌గా నిలిచిన తన్వీ శర్మ.. తాజాగా పసిడి పోరుకు చేరుకుంది. బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌లో శనివారం గువహటిలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో చైనా అమ్మాయి లియు షి యాపై 15-11, 15-9తో వరుస గేముల్లో తన్వీ శర్మ విజయం సాధించింది.

టాప్‌ సీడ్‌ తన్వీ శర్మ నేడు జరిగే మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ అన్యపత్‌ (థారులాండ్‌)తో తలపడనుంది. సెమీస్‌ విజయంతో.. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లోకి ప్రవేశించిన ఐదో భారత షట్లర్‌గా తన్వీ శర్మ నిలిచింది. అపర్ణ పోపట్‌ (1996), సైనా నెహ్వాల్‌ (2006, 2008), సిరిల్‌ వర్మ (2015), శంకర్‌ ముతుస్తామి (2022) తర్వాత పసిడి పోరుకు భారత్‌ నుంచి తన్వీ శర్మ చేరుకుంది. శుక్రవారం క్వార్టర్‌ఫైనల్లో విజయంతోనే 17 ఏండ్ల పతక నిరీక్షణకు తెరదించిన తన్వీ శర్మ… నేడు పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -