ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వార్2’. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతన్న ఈ 6వ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కి ఈ సినిమా రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ,’ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా అంతకుమించి ఆసక్తికరంగా కథను రూపొందించటంలో ఎక్కువగా సమయాన్ని వెచ్చించాను. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన ‘వార్’ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలని ఓ పెద్ద బాధ్యతగా స్వీకరించాను. ఈ సినిమాను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకెళుతున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయతీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా ఈ సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంత ఎగ్జైటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలని ఆలోచించి తెరకెక్కించాం’ అని అన్నారు.
ఆ సంఘర్షణ.. ఆసక్తికరం
- Advertisement -
- Advertisement -