తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మీడియాతో ముచ్చటించారు.
-‘ఇది రీమేక్. ఇలాంటి సినిమా నాకు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా ఒరిజినల్ నాకు చాలా ఇష్టం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇది అందరూ యూనివర్సల్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీ.
-మన తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో, పాత్రల్లో చాలా మార్పులు చేశారు. ఇందులో ఉండే ఎమోషన్స్ అందరు కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి. సినిమా చూస్తున్నప్పుడు రీమేక్ అనే ఫీలింగ్ రాదు. ఇందులో అన్ని క్యారెక్టర్స్‌కి ఆడియన్స్ రిలేట్ అవుతారు.
-నాకు శాంతి క్యారెక్టర్ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్ర వస్తే చేయాలని అనుకునేదాన్ని. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ సినిమాకి హండ్రెడ్ పెర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను.
-ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇందులో మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ని చాలా ఫన్నీగా అలాగే ఎంటర్టైనింగ్‌గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మెసేజ్ ఇచ్చినట్లుగా ఉండదు. తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ.
ఆ ఫీలింగ్ రాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



