Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఆ.. ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించినవసరం లేదు

ఆ.. ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించినవసరం లేదు

- Advertisement -

– బీహార్‌లో ఎస్‌ఐఆర్‌పై ఈసీ స్పష్టత
న్యూఢిల్లీ :
బీహార్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల యొక్క స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టత ఇచ్చింది. 1987 తరువాత జన్మించిన ఓటర్లు తమ తల్లిదండ్రుల పేర్లు 2003 ఓటర్ల జాబితాలో ఉంటే వారు ఏ విధమైన పత్రాలు సమర్పించినవసరం లేదని ఈసీ సోమవారం ప్రకటించింది. 4.96 కోట్ల మంది ఓటర్ల వివరాలతో కూడిన 2003 బీహార్‌ ఓటర్ల జాబితాను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఎన్నికల కమిషన్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాను అన్ని బూత్‌ లెవల్‌ అధికారులకు హార్డ్‌ కాపీలో అందుబాటులో ఉంచడంతో పాటు, ఓటర్లు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఉపయోగించుకునే విధంగాను అందుబాటులో ఉంచినట్టు ఈసీ తెలిపింది.

బీహార్‌ ఓటర్లలో 1987 తరువాత జన్మించిన వారు దాదాపు 60 శాతం మంది ఉన్నారని, వీరికి ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని ఈసీ తెలిపింది. వీరంతా 2003 ఓటర్ల జాబితాలో తమ వివరాలను ధ్రువీకరించుకుని, పూరించిన ఫారమ్‌ సమర్పించాలని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ను ఇది మరింత సులభతరం చేస్తుందని చెప్పింది. 2003 బీహార్‌ ఓటర్ల జాబితాలో పేరు లేని ఎవరైనా తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఇతర పత్రాలను అందించడం కంటే 2003 ఓటర్ల జాబితాను ఉపయోగించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. 1987 తరువాత జన్మించిన వారు తల్లి లేదా తండ్రికి సంబంధించిన వేరే ఏ ఇతర పత్రాలు అవసరం లేదని స్పష్టం చేసింది.


జూన్‌ నెల ప్రారంభంలో ఎలక్షన్‌ కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 2003 ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని ఏ వ్యక్తి అయినా ఓటరుగా తమ అర్హతను నిర్ధారించడానికి విస్తృతంగా ప్రభుత్వ పత్రాలను సమర్పించాలి. గణన ఫారమ్‌తో పాటు, అందులో చేసిన వెల్లడించిన వివరాలకు మద్దతుగా దరఖాస్తుదారుడు అదనపు డిక్లరేషన్‌ ఫారమ్‌ను కూడా నింపాల్సి ఉంటుంది.


1987, జులై 1 కి ముందు జన్మించిన వారు తమ పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిర్ధారించే ఏదైనా ప్రభుత్వ పత్రం అవసరం. 1987, జులై 1 నుంచి 2002 డిసెంబరు 2 మధ్య జన్మించిన వారు తమ పుట్టిన ప్రదేశం, తేదీని రుజువు చేసే డాక్యుమెంట్‌తో పాటు తల్లిదండ్రుల పత్రాలు కూడా ఇవ్వాలి. 2004 డిసెంబరు 2 తర్వాత జన్మించిన వారు తమ పుట్టిన ప్రదేశం, తేదీని రుజువు చేసే పత్రాలతో పాటు, తల్లిదండ్రులిద్దరినీ కూడా ఇవ్వాలి. ఈసీఐ ప్రకటించిన మార్గదర్శకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. ఇది ఎన్‌సీఆర్‌ను దొడ్డిదారిన ప్రవేశపెట్టడమేనని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad