అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వీసా – వింటారా సరదాగా’ చిత్రం నుండి తొలి గీతం ‘అనగా అనగా అమెరికా’ విడుదలైంది. విన్న తక్షణమే శ్రోతల హదయాలను గెలుచుకుంటూ, అన్ని వేదికల్లోనూ విశేష స్పందనను సొంతం చేసుకుంటోంది.
ఇప్పటికే టీజర్ అద్భుతమైన స్పందనతో అంచనాలను పెంచేయగా, ఇప్పుడు ఈ మధుర గీతం చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేసింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ పాటకు సనారె రాసిన సాహిత్యం వినసొంపుగా, అందరూ అనుభూతి చెందేలా ఉండి, శ్రోతల మన సులను తాకుతోంది.
‘అనగా అనగా అమెరికా.. కథ మొదలిక.. మది గదులని తెరువగా..’ అంటూ అంటూ సాగిన సాహిత్యం కట్టిపడేసింది. గాయకుడు సంజిత్ హెగ్డే తన మధుర గానంతో ఈ పాటకు ప్రాణం పోశారు.
సంగీత దర్శకుడు విజరు బుల్గానిన్ ఎప్పటికీ నిలిచిపోయే శ్రావ్యమైన పాటలను రూపొందిం చడంలో తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించు కున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ మధ్య కుదిరిన సహజమైన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల మనసులను తాకే ఓ మధురమైన ప్రేమానుభూతిని అందిస్తున్నారు. నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజరు, శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
‘అనగా అనగా అమెరికా..’
- Advertisement -
- Advertisement -



