Tuesday, October 14, 2025
E-PAPER
Homeసినిమాఅది బాగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది

అది బాగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది

- Advertisement -

హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన తాజా సినిమా ‘కె-ర్యాంప్‌’. హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ బ్యానర్‌ల మీద రాజేష్‌ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం దర్శకుడు జైన్స్‌ నాని మీడియాతో సినిమా విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
‘కె-ర్యాంప్‌’ అనే టైటిల్‌ ఈ కథకు సరిపోతుందనే పెట్టాం. బూతు పదం అని ఆలోచించలేదు. ఇందులో హీరో క్యారెక్టర్‌ పేరు కుమార్‌. కథానుసారం ఈ క్యారెక్టర్‌ ఇబ్బందుల్లో పడుతుంది. ర్యాంప్‌ అనే మాట మనందరికీ తెలుసు. అలా కథకు, హీరో క్యారెక్టరైజేషన్‌కు సరిపోయేలా ‘కె-ర్యాంప్‌’ అని పెట్టాం. క్యాచీగా ఉండటంతో త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్తుందని అనిపించింది.
ట్రైలర్‌ చూసి ఒకట్రెండు మాటలు ఇబ్బందిగా ఉన్నాయని అనుకోవద్దు. ఇది పక్కాగా ఫ్యామిలీస్‌ చూడాల్సిన సినిమా. ప్రతి ఆడియెన్‌ రిలేట్‌ అయ్యేలా ఈ స్టోరీ ఉంటుంది. పేరెంట్స్‌ ఈ సినిమా చూడాలి. కొన్ని సినిమాల్లో మూవ్‌మెంట్స్‌ మాత్రమే ఉంటాయి, కానీ ఇందులో మంచి కథతోపాటే మూవ్‌మెంట్స్‌ను డిజైన్‌ చేశాం. ఇంటర్వెల్‌ బ్లాక్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది.
హీరోయిన్‌ క్యారెక్టర్‌ కోసం యుక్తిని అనుకున్న తర్వాత వర్క్‌ షాప్‌ చేయించాం. ఈ పాత్రకు యుక్తి పర్పెక్ట్‌గా సెట్‌ అయ్యింది. హీరో, హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌కు పర్‌ఫార్మెన్స్‌ పరంగా చాలా స్కోప్‌ ఉన్న కథ ఇది. ఫస్టాఫ్‌లో హీరో క్యారెక్టర్‌, సెకండాఫ్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది.
ఫ్రెష్‌నెస్‌ కోసమే కేరళ బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నాం. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే కథ కేరళకు షిప్ట్‌ అవుతుంది. కొత్త ప్లేస్‌కు వెళ్లడం వల్ల సినిమాకు కొత్త విజువల్స్‌ యాడ్‌ అవుతాయి. అక్కడ నేటివిటీ, లాంగ్వేజ్‌ ఉపయోగపడుతుంది. ఫన్‌ క్రియేట్‌ అవుతుంది. బీజీఎంలోనూ అక్కడి స్టైల్‌ సౌండ్‌ వాడుకోవచ్చు. కేరళలోని ఓ మంచి కాలేజ్‌ లొకేషన్‌లో ఎక్కువ భాగం, అలాగే కేరళలోని బ్యూటీఫుల్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం.
ఇందులో మూడు సాంగ్స్‌ ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌ అవుతుంది. థియేటర్‌లో బీజీఎంను ఎంజారు చేస్తారు. దీపావళికి మన బాక్సాఫీస్‌ వద్ద కాంపిటేషన్‌ ఉంది. మేము ఫన్‌ కోసం మా సినిమాకు రమ్మని చెబుతున్నాం. ఇందులో కామ్నా జెఠ్మలానీ చిన్న గెస్ట్‌ రోల్‌ చేశారు. నరేష్‌తో ఆమెకు ఉన్న కాంబినేషన్‌ సీన్స్‌ హిలేరియస్‌గా వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -