Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅంతే పవర్‌ఫుల్‌గా..

అంతే పవర్‌ఫుల్‌గా..

- Advertisement -

‘అఖండ 2’లో హీరో బాలకృష్ణ వాడిన రోక్స్‌ వాహనాన్ని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఎక్స్‌ డ్రైవ్‌ అత్యా ధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా, ఎక్స్‌ స్టూడియోస్‌ దానికి అద్భుతమైన సినీమాటిక్‌ లుక్‌ను అందించింది. పవర్‌, వారసత్వం, మాస్‌ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా ఈ వాహనం రూపుదిద్దుకుంది. బాలకృష్ణ శక్తివంతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు ప్రతిబింబంగా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో రూపొందించబడింది. గురువారం జరిగిన ఈ వెహికల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు దర్శకుడు బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’అఖండ 2’కోసం 10 వెహికల్స్‌ డిజైన్‌ చేయించాం. అమర్‌ అద్భుతంగా డిజైన్‌ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోక్స్‌ వెహికల్‌ను ఎంతో కష్టపడి గొప్పగా డిజైన్‌ చేశారు. ఈ వెహికల్‌ని యాక్షన్‌లో ఎంత అద్భుతంగా వాడుకున్నామో అది మీరు థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. చాలా ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతారు.

ఒక పవర్‌ ఉన్న క్యారెక్టర్‌ దిగి వస్తుంటే, దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్‌ ఉండాలి. క్యారెక్టర్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికల్‌ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మేము కోరుకున్నట్టుగా ఈ వెహికల్‌ని చాలా తక్కువ రోజుల్లోనే అద్భుతంగా డిజైన్‌ చేసి ఇచ్చిన అమర్‌కి ధన్యవాదాలు. ‘అఖండ2′ డిసెంబర్‌ 5న రిలీజ్‌ అవుతుంది. అభిమానులు అందరూ చాలా ఆనందంగా ఫీల్‌ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా భారత దేశ ఆత్మ’ అని అన్నారు. ”అఖండ2′ లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి పని చేయడం మా అదృష్టం. ఇందులో మీరు చూస్తున్న ఈ వెహికల్‌ స్క్రీన్‌ మీద మెస్మరైజ్‌ చేస్తుంది. డైరెక్టర్‌ బోయపాటితో మాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఈ వెహికల్‌ని ఎంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఈ ప్రాజెక్ట్‌లో బాగం కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ చిత్రం మీ అందరినీ అలరిస్తుంది’ అని అమర్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -