‘కథగా చూస్తే ‘తమ్ముడు’ సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు’ అని నిర్మాత దిల్‌రాజు అన్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్మాత దిల్ రాజు మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ఈ సినిమాలో మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. ఇందులో ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ కథ స్క్రీన్ ప్లే పరంగా కొత్తగా ఉంటూ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ చిత్రాన్ని 150 రోజుల్లో చిత్రీకరించాం. 80% సినిమా అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్‌లో ఎంజారు చేసేలా దర్శకుడు శ్రీరామ్ వేణు రూపొందించారు. అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. నితిన్, లయ పాత్రలు ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మేం అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుంది అనేది మాత్రం రిలీజ్ రోజునే తెలుస్తుంది.
ఎఫ్‌డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవం చేశాం. అలాగే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుం టున్నాం. ఆన్‌లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతం మా సంస్థలో ‘రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి’ జరుగుతున్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌కు తీసుకొస్తాం.
అదే ‘తమ్ముడు’ ప్రత్యేకత..
- Advertisement -
- Advertisement -