Tuesday, February 17, 2026
E-PAPER
Homeసినిమాఅందుకే టైటిల్‌ మార్చాల్సి వచ్చింది

అందుకే టైటిల్‌ మార్చాల్సి వచ్చింది

- Advertisement -

ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై ‘హే బల్‌వంత్‌’ ( ‘హే భగవాన్‌’ చిత్రం టైటిల్‌ మార్పు) అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుహాస్‌, శివానీ నగరం, సీనియర్‌ నటుడు నరేష్‌, యాంకర్‌ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈనెల 20న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్‌ మంగళవారం మీడియాతో ముచ్చటించారు.

‘హే భగవాన్‌’ నుండి ‘హే బల్‌వంత్‌’ అని టైటిల్‌ మార్చడానికి భగవాన్‌ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది. కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సార్‌వారు సూచించడంతో ‘హే బల్‌వంత్‌’గా మార్చాం. సినిమాలో నరేష్‌ క్యారెక్టర్‌ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంటర్టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా వచ్చింది.

ఈ సినిమాపై అందరికి నమ్మకం ఉంది. వంశీ నందిపాటి మాకు ఎంతో ధైర్యం ఇస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి చేయమని అన్నారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్‌ ఇచ్చి ఈసినిమా చేశాను. తమిళ సినిమా ‘మందాడి’లో మెయిన్‌ విలన్‌గా చేశాను. సినిమా రిజల్ట్‌ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. తమిళంలో విలన్‌ పాత్రలే చేస్తున్నాను. కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -