Saturday, December 27, 2025
E-PAPER
Homeసినిమాఅందుకే షోలు, స్క్రీన్‌లు పెంచుతున్నాం

అందుకే షోలు, స్క్రీన్‌లు పెంచుతున్నాం

- Advertisement -

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్‌, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్‌, ఎన్‌వీఎల్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై నిర్మితమైన చిత్రం ‘బ్యాడ్‌గళ్స్‌’. రేణు దేశాయ్, ఆంచల్‌గౌడ, పాయల్‌ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్‌, రోహన్‌ సూర్య ముఖ్యతారాగణంగా నటించారు. శశిధర్‌ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్‌ నిర్మాతలు. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఈనెల 25న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ విజయోత్సవ వేడుక నిర్వహించింది. దర్శకుడు ఫణి ప్రదీప్‌ ధూళిపూడి (మున్నా) మాట్లాడుతూ,’ఈ సినిమా నిడివి విషయంలో చిన్నది. కానీ కంటెంట్‌ విషయంలో చాలా పెద్దది. ప్రేక్షకులు మా సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

క్రిస్మిస్‌కి ఎంత పోటీ ఉన్నా మన సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందని మా నిర్మాతలు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. వారి నమ్మకం ఇప్పుడు నిజమైంది. అందుకే థియేటర్ల సంఖ్యను పెంచే పనుల్లో ఉన్నాం’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ,’సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. రిలీజ్‌ చేసిన అన్ని థియేటర్ల నుంచి సినిమా బాగుందంటూ ఫోన్స్‌ వస్తున్నాయి. ఇంకా షోలు, స్క్రీన్‌లు పెంచమని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీలో కూడా మా సినిమాని అద్భుతమైన సినిమాగా మార్చారు. ప్రేక్షకులు, థియేటర్ల దగ్గర్నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ డిమాండ్‌ మేరకు స్క్రీన్లను, షోలను పెంచుతున్నాం’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -