Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకమవ్వాలి

రాజ్యాధికారం కోసం మున్నూరు కాపులు ఏకమవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ఏకం కావాలని మున్సిపల్ నూతన కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. శనివారం  మున్సిపల్ పరిధిలోని మున్నూరు కాపు పటేల్ సంఘం (ఎంకెపిఎస్) ఆధ్వర్యంలో నూతనంగా కౌన్సిలర్లుగా గెలుపొందిన ఏడుగురు మున్నూరు కాపు మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం మున్నూరు కాపు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పలుమార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జారవిడుచుకున్న మున్నూరు కాపు నేతలు ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

పార్టీలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానానికి మున్నూరు కాపు నేతలు పోటీ చేయాలని, పార్టీలకతీతంగా వారిని మున్నూరు కాపు కుల సంఘాలు మద్దతు తెలిపి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ యామాద్రి కవితా భాస్కర్, 35వ వార్డు కౌన్సిలర్ సడాక్ వినోద్, 34వ వార్డు కౌన్సిలర్ నర్మేే నవీన్, 12వ వార్డు కౌన్సిలర్ తాటి నీలిమ హనుమాన్లు, 13వ వార్డు కౌన్సిలర్ కొడిగెల మల్లయ్య, 33 వ వార్డు కౌన్సిలర్ బొగడమీది రాణి సుమన్, 9వ వార్డు కౌన్సిలర్ పోచంపాడ్ శ్రీనివాస్ లను ఘనంగా సన్మానించారు.

మున్నూరు కాపుల ఐక్యత బలపడాలనీ, సంఘటితంగా రానున్న ఎన్నికల్లో కూడా మున్నూరు కాపుల ఐక్యతను చాటాలనె ఉద్దేశంతో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించినట్లు మున్నూరు కాపు పటేల్ (ఎంకెపిఎస్) సంఘం అధ్యక్షులు శేఖర్ తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంఘం శాశ్వత అధ్యక్షులు గోపు దేవిదాస్, గౌరవ అధ్యక్షులు గుర్తే సాయన్న, కోశాధికారి గజ్జి శ్రీనివాస్, సభ్యులు పెంట జలంధర్ పటేల్, లక్ష్మీ నరసయ్య  లెక్చరర్ దేవన్న , భోజన , లక్ష్మణ్  పవన్ , గంగాధర్, నాగేష్ , గంగారం , నరేందర్ రావు  సంగం అనిల్ పటేల్, గజ్జి సాయన్న పటేల్, హనుమాన్లు పటేల్, సురేష్ పటేల్, రాజేశ్వర్ పటేల్, మురళి పటేల్, రవి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -