హైదరాబాద్ : నగరంలోని ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగంలో అత్యంత ఆదరణ పొందిన ‘స్టైల్‌తత్వ’ 6వ ఎడిషన్‌ను ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్ చాప్టర్ ఘనంగా ఆవిష్కరించింది. దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి శ్రీలీల హాజరై పోస్టర్‌ను విడుదల చేశారు. 2019లో ప్రారంభమైన స్టైల్‌తత్వ అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్‌లో అత్యంత విశ్వసనీయమైన వేదికగా గుర్తింపు పొందిందని, మహిళా పారిశ్రామికవేత్తల ఎదుగుదలకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని శ్రీలీల కొనియాడారు. ఈ ఏడాది నిర్వహించబోయే 6వ ఎడిషన్‌లో సుమారు 212 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో వినూత్న శైలి ఆభరణాలు, డిజైనర్ వస్త్రాలు, చేనేత కళాఖండాలు, పర్యావరణ హిత బ్రాండ్లు, ప్రత్యేకమైన గౌర్మెట్ విభాగం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ వేదికపై ఉన్న నమ్మకంతో, ఆవిష్కరణ జరిగిన తొలిరోజే 80 స్టాళ్లు బుక్ అవ్వడం విశేషమన్నారు.
ఎఫ్‌ఎల్‌ఓ ‘స్టైల్‌తత్వ’ 6వ ఎడిషన్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



