కథానాయకుడు నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రమిది. షూటింగ్ ఫ్లోర్ నుంచి ప్రకటించిన తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. వందలాది మంది డ్యాన్సర్స్‌తో ఉన్న భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్..’ షూటింగ్‌ని టీమ్ ప్రారంభించింది. అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్ అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్.
విజయ్ ‘జన నాయగన్’కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్ షార్ప్ మూవ్స్, పవర్‌ఫుల్ ఫార్మేషన్స్‌తో ఈ పాటను గూస్‌బంప్స్ కలిగించే విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారు. నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో ఈ పాట అద్భుతంగా ఉంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల, డిఓపి: సిహెచ్ సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.
భారీ సెట్‌లో ‘ఆయా షేర్..’ సాంగ్ షూటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



