- Advertisement -
రాష్ట్ర ప్రేరణ్ స్థల్‌ను ప్రారంభించిన ప్రధాని
లక్నో : ఆర్టికల్ 370 గోడను కూల్చే అవకాశం తమ ప్రభుత్వానికి లభించడం బీజేపీకి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణ స్థల్’ ను ప్రారంభించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సృష్టించిన సుపరిపాలన వారసత్వాన్ని ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో నూతన శిఖరాలకు తీసుకెళుతున్నామని చెప్పారు. స్వాతంత్య్రం లభించిన తర్వాత, ప్రతి ఒక్క సానుకూల విజయాన్ని ఒకే కుటుంబానికి ఆపాదించే వైఖరి ఎలా అభివృద్ధి చెందిందో మనం ఎన్నడూ మరిచిపోరాదన్నారు.
- Advertisement -



