- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం రేపింది. శివరాజ్ అనే వ్యక్తి మహిళతో పాటు బాలుడిని చంపాడు. ఐదు రోజుల క్రితం శివరాజ్, చంద్రకళ(30) తెల్లాపూర్ కు వచ్చి భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చంద్రకళతో పాటు 8 ఏళ్ల బాలుడిని శివరాజ్ హత్య చేసి ఆ తర్వాత గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



