Tuesday, July 22, 2025
E-PAPER
HomeNewsఅంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి 

అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి 

- Advertisement -
  • – అంబేద్కర్ వాదులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ 
    నవతెలంగాణ కంఠేశ్వర్ 
  • నిజామాబాద్ జిల్లా , డిచ్పల్లి మండలంలోని శుద్ధపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసి విగ్రహంకు ఉన్న కంటి అద్దాలను తొలగించి కనులను పొడిచి నా గుర్తుతెలియని దుండగులను వెంటనే అరెస్టు చేయాలని అంబేద్కర్ వాదులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ నీరడి లక్ష్మణ్ డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన తీరును పరిశీలించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
  • సంఘటన స్థలం నుండి నిజామాబాద్ రూరల్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, డిచ్పల్లి ఎస్సై కు ఫోన్ చేసి అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన ఘటనకు సంబంధించిన దుండగులను అరెస్టు చేయాలని కోరారు. స్పందించిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటామని చెబుతూనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ నీరడ్డి లక్ష్మణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసి కళ్లద్దాలు తీసేసి కండ్లను పొడిచిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని కోరారు. లేనియెడల రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం అధ్యక్షులు పోతే ప్రవీణ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -