Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమకారుల సంఘం ప్రార్థనలు 

డిమాండ్లు నెరవేర్చాలని ఉద్యమకారుల సంఘం ప్రార్థనలు 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యమకారుల సంఘం సభ్యులు గురువారం పలు ప్రార్థన మందిరాల్లో ప్రార్థనలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళ ఉద్యమకారుల సంగం గౌరవ అధ్యక్షురాలు యాస పూలమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఆర్థికంగా మానసికంగా నష్టపోయామని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరుస్తారన్న ఆశతో ఉన్నామని అన్నారు. ఉద్యమకారుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దేవుడి కృపతో నెరవేర్చాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చర్చిలు , మసీదులలో ప్రార్థనలు జరిపి నిరసన వ్యక్తం చేయటం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళ ఉద్యమకారుల సంఘం  మండల ఉపాధ్యక్షురాలు ఉపేంద్ర, మండల కార్యదర్శి సామా సమ్మక్క, కోశాధికారి సామ సరోజన, సంఘం అధికార ప్రతినిధి కొండి రమేష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad