- Advertisement -
న్యూఢిల్లీ : ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజాగా భారత్‌కు 4.26 బిలియన్ డాలర్ల అప్పు ప్రకటించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.35,000 కోట్లకు సమానం. ప్రస్తుత ఏడాది 2025కి గాను ఈ రుణాన్ని జారీ చేసింది. నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, నగరాల ఆధునీకరణ, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన పర్యాటకం వంటి రంగాల్లోని ప్రాజెక్టులకు గాను ఈ అప్పులను అందించనుంది. సామాజిక అభివృద్ధి, నిరుద్యోగ్యాన్ని తగ్గించడానికి 32 శాతం నిధులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇంధన రంగం 26 శాతం, పట్టణాభివృద్ధి కోసం 18 శాతం చొప్పున కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
- Advertisement -



