Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉపాధ్యాయుల సంబంధమైన సర్దుబాటు ప్రక్రియను నిలిపి వేయాలి

ఉపాధ్యాయుల సంబంధమైన సర్దుబాటు ప్రక్రియను నిలిపి వేయాలి

- Advertisement -

– టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రవీందర్
నవతెలంగాణ
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జాబితా చాలా ఆశాస్త్రీయంగా ,అసంబద్ధంగా ఉందని దీనిని వెంటనే సవరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పర్కాల రవీందర్, జంగిటి రాజు లు డిమాండ్ చేశారు.ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఈ సర్దుబాటు ప్రక్రియను చేసారని దీనిని వెంటనే విరమించుకోవాలని వారు కోరారు .కొనరావుపేట్ మండలంలోని ఒక ప్రాథమిక పాఠశాల లో 118 విద్యార్థులకు గానూ 5 గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.టెక్నీకల్ ప్రాబ్లెమ్స్ వల్ల అందరూ విద్యార్థులవి ఆన్లైన్ అయ్యుండక పోవచ్చు.నిబంధనల ప్రకారం ఒక ఉపాధ్యాయుడిని మాత్రమే తీయాలి.. కానీ ఇద్దరు ఉపాద్యాయులను సర్దుబాటు చేయడం వల్ల 118 విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తారని పేర్కొన్నారు.

అదేవిధంగా మరొక ప్రాథమిక పాఠశాల లో 11 మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయుడిని సర్దుబాటు లో భాగంగా వేరే పాఠశాలకు కేటాయించడం వల్ల అక్కడి 11 మంది విద్యార్థులకు బోధన చేసే వారే లేకుండా పోయారు ,అదేవిధంగా ఒకపాఠశాల లో ఇద్దరు ఉపాద్యాయులకు సరిపడ విద్యార్థులు ఉన్నప్పటికీ,ఆ పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు కేటాయించి వేరే పాఠశాల నుండి ఒక ఉపాధ్యాయుడిని మళ్ళీ అదే పాఠశాల కు కేటాయించడం దారుణం అని పేర్కొన్నారు.ఉన్నత పాఠశాల లో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాద్యాయులు వారి సబ్జెక్ట్ కి సంబందించిన అన్ని అన్ని తరగతులకు పాఠ్యాంశాలు బోధించలనడం దారుణమన్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇలా సర్దుబాటులో చాలా పాఠశాలలకు అన్యాయం జరిగింది. క్షేత స్థాయిలో సమాచారం తీసుకోకుండానే ఈ సర్దుబాటు ప్రక్రియ చేసినట్టుగా కనిపిస్తుందని,గుణాత్మక విద్యకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ సర్దుబాటులో జరిగినా పొరపాట్లను సవరించాలని అప్పటివరకు అసంబద్ధంగా ,ఆశాస్త్రీయంగా ఉన్న సర్దుబాటు ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -