Wednesday, January 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ బలగాల దురాక్రమణ

ఇజ్రాయిల్‌ బలగాల దురాక్రమణ

- Advertisement -

– తూర్పు జెరూసలేంలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కార్యాలయం విధ్వంసం
– సిబ్బంది ఫోన్లు, కంప్యూటర్లు లాక్కుని, గెంటివేత
జెరూసలేం :
తూర్పు జెరూసలేంలో పాలస్తీనా శరణార్ధుల వ్యవహారాలు చూసే ఐక్యరాజ్య సమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ప్రధాన కార్యాలయంలో కొంత భాగాన్ని ఇజ్రాయిల్‌ బలగాలు మంగళవారం కూల్చివేశాయి. ‘ఇది అనూహ్యమైన దాడి’ అనియూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం కిందకే వస్తుందని, ఐక్యరాజ్య సమితి హక్కులు, రక్షణలన్నింటిపై దాడి చేయడమేనని ఆ పోస్టు పేర్కొంది. సిబ్బంది ఫోన్లను, కంప్యూటర్లను సైన్యం లాగేసుకుందని, వారిని బలవంతంగా కార్యాలయ ఆవరణ నుండి బయటకు గెంటివేశారని ఆ పోస్టు పేర్కొంది. అలాగే పాలస్తీనా ట్రేడ్‌ స్కూల్‌పై ఇజ్రాయిల్‌ బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించాయి. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వెస్ట్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ రోలాండ్‌ ఫ్రెడ్‌రిక్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ బలగాలు జెరూసలేం శివార్లలోని క్వలాండియాలో యువ పాలస్తీనియన్ల కోసం ఏర్పాటు చేసిన వొకేషనల్‌ స్కూల్‌కు చేరుకుని కాల్పులు జరిపాయని చెప్పారు. ఈ స్కూల్లో 300మందికి పైగా యువ శరణార్ధులు టెక్నాలజీలో, వెల్డింగ్‌లో ఉపాధి శిక్షణ పొందారని తెలిపారు.
గాజా, వెస్ట్‌ బ్యాంక్‌, అలాగే జోర్డాన్‌, లెబనాన్‌, సిరియాల్లో పాలస్తీనా శరణార్ధులకు ఆరోగ్య సంరక్షణను అందిస్తూ వారికోసం స్కూళ్ళు, శరణార్ధుల శిబిరాలను యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ నడుపుతోంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను అందించడంలో ఈ సంస్థ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది.
ఆ సంస్థ పైనే నిషేధం విధిస్తూ కొత్త చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ విధ్వంస చర్యలు చేపట్టినట్లు ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ తెలిపింది. హమాస్‌కు మిలిటెంట్‌ గ్రూపులతో ఈ సంస్థ సంబంధాలు కొనసాగిస్తోందని ఆరోపించింది. జాతీయ భద్రతా వ్యవహారాల మంత్రి ఇటామిర్‌ బెన్‌ గివిర్‌ మొత్తంగా ఈ వ్యవహారంపై ఒక ప్రకటన చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -