• రేపు పెద్దవంగర లో భూమి సునీల్ పర్యటన
• రైతుల భూ సమస్యలకు ఉచిత పరిష్కార సేవలు
• లీఫ్స్ సంస్థ సలహాదారు కరుణాకర్ దేశాయ్
నవతెలంగాణ పెద్దవంగర
సాగు న్యాయ యాత్రలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని లీఫ్స్ సంస్థ సలహాదారు కేతిరెడ్డి కరుణాకర్ దేశాయ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం ప్రధాన రూపకర్త భూమి సునీల్ ఆధ్వర్యంలో రేపు పెద్దవంగర రైతు వేదికలో సాగు చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గ్రామాల మీదుగా దాదాపు మూడు వేల కిలోమీటర్లు పర్యటించనున్న ఈ బృందం రెండో విడతగా ఈ నెల 17 (సోమవారం) నుంచి ‘సాగు న్యాయ యాత్ర’ను ప్రారంభించనుంది.
ఈ యాత్ర జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నాగారం, జాజిరెడ్డిగూడెం వరకు భూమి సునీల్ నేతృత్వంలో కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చేస్తూ రైతులకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చట్టాలను అధ్యయనం చేయడం, రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, ఈ రెండు వినూత్న ప్రయత్నాలు, దేశంలోనే మొదటిసారి కావడం గర్వకారణం అన్నారు. భూమి సునీల్ సాగు చట్టాలపై ఇచ్చి సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



