Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఐద్వా' మహాసభలు విజయవంతం

‘ఐద్వా’ మహాసభలు విజయవంతం

- Advertisement -

– సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
– రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి కృతజ్ఞతలు
– 23 కమిటీల సేవలు భేష్‌ : రిసెప్షన్‌ కమిటీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ జాతీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయని రిసెప్షన్‌ కమిటీ చైర్మెన్‌, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రకటించారు. మహాసభలకు ఆర్థికంగా, హార్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధానాల సహకారమందేలా చూసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మల్లు స్వరాజ్యం ప్రాంగణం(ఆర్టీసీ కళ్యాణమండపం ఆడిటోరియం)లో ఐద్వా 14వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాసభ విజయవంతానికి 450 మంది వాలంటీర్లతో 23 కమిటీలు అందించిన సేవలు భేష్‌ అని కొనియాడారు. దాదాపు 2 వేల మంది ఐద్వా సభ్యులు రాష్ట్రంలోని 30 వేలకుపైగా కుటుంబాలను కలిసి మహాసభ సందేశాన్ని, కర్తవ్యాలను ప్రచారం చేశారనీ, వారి ఆర్థిక, హార్థిక మద్దతును పొందారని తెలిపారు. ఈ మహాసభ రాష్ట్రంలో మహిళా ఉద్యమాలు బలోపేతం కావడానికి దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు గ్రౌండ్‌, ప్రతినిధుల సభకు కళ్యాణమండపం ఇచ్చి సహకరించిన ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీడియా, రవాణా, పోలీసు విభాగాలు తమ మహాసభల విజయవంతంలో కృషి చేశాయని కొనియాడారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సిబ్బంది మహాసభ ప్రాంగణంలో, బహిరంగ సభ వద్ద పారిశుధ్య నిర్వహణలో సహాయం అందించారని తెలిపారు. ప్రతినిధులకు, అతిథులకు సౌకర్యవంత రీతిలో వసతి కల్పించడానికి, ఆతిథ్యం అందించడానికి తమ శక్తి మేరకు కృషి చేశామని చెప్పారు. మహాసభల ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో డెలిగేట్లలో ఉద్యమ చైతన్యాన్ని నింపిన ప్రజానాట్యమండలి కళాకారులకు అభినందనలు తెలిపారు. ఆయా కమిటీల కన్వీనర్లుగా వ్యవహరించిన ప్రజాసంఘాల నాయకులను, కమిటీల సభ్యులను మహాసభకు పరిచయం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -