Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐద్వా జాతీయ మహాసభను జయప్రదం చేయాలి

ఐద్వా జాతీయ మహాసభను జయప్రదం చేయాలి

- Advertisement -

– హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్రచారం
నవతెలంగాణ-అంబర్‌పేట

ఐద్వా 14వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి వై.వరలక్ష్మి పిలుపునిచ్చారు. మహాసభ సందర్భంగా బుధవారం అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట చెరువు వద్ద బెలూన్లు ఎగరవేశారు. అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి వరలకిë మాట్లాడుతూ.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా మహిళల పట్ల వివక్షత ఇంకా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి ఆలోచనలు ఇప్పటికీ పురాతన ధోరణిలోనే ఉన్నాయని తెలిపారు. మహిళల వస్త్రధారణ నుంచి వారి ప్రవర్తన, మాట్లాడే విధానంపై ప్రభుత్వాలు, వాటికి వత్తాసు పలికే మీడియా, సోషల్‌ మీడియా పదే పదే ఒక నిర్దిష్ట భావజాలాన్ని సమాజంలో నాటుతున్నాయన్నారు. ఆ భావజాలం నుంచి బయటపడి మహిళలకు సమాన హక్కులు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల హక్కులు, గౌరవం కోసం ఐద్వా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతోందని, రాబోయే కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే కార్యక్రమాలపై జాతీయ మహాసభలో విస్తృతంగా చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న జరిగే ర్యాలీ, బహిరంగ సభకు మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ కమిటీ సభ్యులు షబానా, లక్ష్మీబాయి, పద్మ, సీఐటీయూ నాయకుడు రాములు, కేవీపీఎస్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -