నవతెలంగాణ – పెద్దవూర
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని నాగార్జున సాగర్ ఎం ఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం లో 1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆస్పత్రిని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి తో కలిసిప్రారంభించారు. మాట్లాడారు.ఎంతో కాలంగా ఎదురు సూస్తున్న ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఆనాడు రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తే, ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారన్నారు. వైద్యపరంగా పేదలకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం వైద్య సేవలను అందుబాటు లోకి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పినకు, విద్య, వైద్య,వ్యవసాయరంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకంలో ఐదులక్షల నుంచి పది లక్షల వరకు పెంచి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే అనంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులు 1.56 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసిందన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వ పథకాలను కొనసాగించాల్సిందేనని అన్నారు. మండల అధ్యక్షులు పబ్బు యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ ఓ కేస రవి,మండల వైద్యాధికారి నగేష్,పీఓడీడీ కృష్ణ కుమారి,తాహశీల్దార్ శ్రీనివాస రావు,ఎంపీడీవో సుధీర్ కుమార్,మండల సీహెచ్ఓ శ్రీనివాస్,జెడ్పి మాజీ వెస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి,మాజీ ఎంపీపి శంకర్ నాయక్,పీఏసీఎస్ ఛైర్మెన్ గుంటుక వెంకట్ రెడ్డి,జిల్లా యువజన నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు చామల సువర్ణ,మండల యూత్ అధ్యక్షులు రేపాకుల సాయి కుమార్,యువ నాయకులు కిలారీ మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES