జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
సబ్బండ వర్ణాల అభివృద్ధి కాంగ్రెస్ ధ్యేయమని, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంతో పాటు, పార్టీ అధ్యక్షున్ని బీసీ వర్గానికి కేటాయించి కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకుందని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సొంతింటి కలను నెరవేరుస్తూ పేదల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.
గత ప్రభుత్వ హయాయంలో మహిళలను కించపరుస్తూ మంత్రివర్గంలో ఒక పదవి కూడా ఇవ్వని నియంత ప్రభుత్వం కేసీఆర్ దని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు మారుపేరని అన్నారు. దొరల పాలనలో సబ్బండ వర్ణాలు అణిగిపోయాయని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియను కామారెడ్డి లోని గౌరవ షబ్బీర్ అలీ ఇంట్లో ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అమలును జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు దయ్యాలు వేదాలను వల్లించినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ కు బుద్ధి రావడం లేదనిఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవాలని సూచించారు.
సబ్బండవర్ణాల అభివృధ్దే కాంగ్రెస్ ధ్యేయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES