Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసామాజిక భద్రతే ఈఎస్‌ఐసీ లక్ష్యం

సామాజిక భద్రతే ఈఎస్‌ఐసీ లక్ష్యం

- Advertisement -

– ప్రాంతీయ డైరెక్టర్‌ రాజీవ్‌లాల్‌
– 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులో సైక్లింగ్‌ నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ సామాజిక భద్రతా చట్రాన్ని బలోపేతం చేయడంలో ఈఎస్‌ఐసీది కీలక పాత్ర అని ఈఎస్‌ఐసీ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజీవ్‌లాల్‌ నొక్కి చెప్పారు. ఈఎస్‌ఐసీ 75 వ్యవస్థాపక వేడుకలను పురస్కరించుకుని ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో గ్రాండ్‌ సైక్లింగ్‌ ఈవెంట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శారు) సహకారంతో సైక్లింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రికి చెందిన సీనియర్‌ అధికారులు, డాక్టర్లు, మెడికల్‌ విద్యార్థులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వంద మందికిపైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌లాల్‌ మాట్లాడుతూ..ప్రజల్లో ఫిట్‌నెస్‌, ఆరోగ్య సంరక్షణ, సామూహిక శ్రేయస్సును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని చెప్పారు. ఏడు దశాబ్దాలకుపైగా సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ సేవలకు మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవన సంస్కృతిని పెంపొందించడానికి ఈఎస్‌ఐసీ నిబద్ధతతో పనిచేస్తున్నదని తెలిపారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి డీన్‌ డాక్టర్‌ శిరీష్‌ చవాన్‌ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడంలో శారీరక దృఢత్వం ఔచిత్యాన్ని నొక్కి చెప్పారు. సైక్లింగ్‌లో పాల్గొన్నవారిని ప్రశంసించారు. సైక్లింగ్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -