Thursday, March 5, 2026
E-PAPER
Homeఖమ్మంసృజనాత్మకత, పుస్తక పఠనంపై ఆసక్తి రేకెత్తించడమే బాలమేళ లక్ష్యం 

సృజనాత్మకత, పుస్తక పఠనంపై ఆసక్తి రేకెత్తించడమే బాలమేళ లక్ష్యం 

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు సృజనాత్మకత,పుస్తక పఠనం పై ఆసక్తి రేకెత్తించడమే బాల మేళ ల లక్ష్యం అని ఎంఈఓ ప్రసాదరావు అన్నారు. గురువారం మండలం పరిధిలోని ఊట్లపల్లి ఎంపీయూపీఎస్ ప్రాంగణంలో నిర్వహించిన మండల స్థాయి బాల మేళ ( లైబ్రరీ అండ్ లెర్నింగ్ ఫెస్ట్ )కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ .. లైబ్రరీ అండ్ లెర్నింగ్ ఫెస్ట్ అనేది పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచేందుకు, చదువు పట్ల ప్రేమను పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు లేదా ప్రజా గ్రంథాలయాలలో నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమం అన్నారు. పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడం,గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడం సృజనాత్మకత మరియు ఆలోచనా శక్తిని పెంచడం విద్యార్థులకు తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించే వేదిక అని తెలిపారు.

కథా విందు, కవితా, వ్యాస రచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయుడు కిషిందర్ రెడ్డి, అశ్వారావుపేట, అచ్యుతాపురం, నారాయణపురం, గుమ్మడి వల్లి కాంప్లెక్సు హెచ్ ఎం లు పి.హారిత,కొండల రావు,షాహినా బేగం,ఎస్.వెంకటేశ్వరరావు,వీరేశ్వరరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -