Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

- Advertisement -
  • – ప్రతి నిరుపేద వ్యక్తి రేషన్ కార్డు పొందే హక్కు ఉంది 
    – రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క 
    – మండలంలో 1299 రేషన్ కార్డుల పంపిణీ 
    నవతెలంగాణ-తాడ్వాయి
  • పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రతి నిరుపేద వ్యక్తి రేషన్ కార్డు పొందే హక్కు ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మండలం కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ భవనంలో అదనపు కలెక్టర్ మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి అన్నారు లతో కలిసి కొత్త రేషన్ కార్డు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా నూతన పథకాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
  • రేషన్ కార్డులు మంజూరు కోసం గతంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయడం జరిగిందని, నేడు అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 222 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జిల్లా యంత్రాంగం పూర్తి చేసిందని, సంబంధిత అధికారులను అభినందించారు. సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయడంతో కడుపునిండా తిండి తిని కంటి నిండా నిద్రపోతున్నారని హర్షం వ్యక్తం చేశారు.
  • మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పలు వ్యాపారాల్లో అవకాశం కల్పిస్తూ మహిళా గ్రూపు సంఘాలకు ప్రభుత్వం 26 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందజేసిందని, పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానీ నిరుపేదలు ఎవరు నిరాశ చెందవద్దని, విడతల వారీగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
  • రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలను చూసి ఓర్వలేక కొందరు రాజకీయం చేస్తున్నరని, గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. రానున్న రోజులలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, డి సి ఎస్ ఓ షా ఫైజల్ హుస్సేని, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డి.ఎస్.పి ఎన్ రవీందర్, స్థానిక తహసిల్దార్ సురేష్ బాబు, ఎమ్మారై డేగల సాంబయ్య, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు, సీతక్క యువసేన అధ్యక్షులు చెర్ప వీందర్, పాక సాంబయ్య, మర్రి నరేష్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, రైతులు, మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -