నాగర్‌కర్నూల్ : ఆల్‌ఇండియా ఓపెన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ నాగర్‌కర్నూల్‌లో ఆదివారం ఘనంగా ఆరంభమైంది. జమ్మూకాశ్మీర్, చండీగడ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ నుంచి 16 జట్లు పోటీపడుతున్న నాకౌట్ ఫార్మాట్ టీ20 టోర్నమెంట్‌ను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో కలిసి తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం అధ్యక్షుడు, శాట్స్ మాజీ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో న్యూస్టార్‌పై చెన్నై గెలుపొందింది. టోర్నమెంట్ విజేతకు రూ. 5.55 లక్షలు, రన్నరప్‌కు రూ.3.33 లక్షల నగదు బహుమతి అందిస్తున్నట్టు నిర్వాహకులు ఏ. సురేందర్ రెడ్డి వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు రాజేందర్ రెడ్డి, బి.రాజశేఖర్, టి. సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



