Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్యారోగ్య శాఖ ఉద్యోగి పై ఆరోపణలు అవాస్తవం...

వైద్యారోగ్య శాఖ ఉద్యోగి పై ఆరోపణలు అవాస్తవం…

- Advertisement -

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
రాష్ట్రవైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న అధికారిపై లైంగిక వేధిం పులు, డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు అవాస్తవమని అంతర్గత విచారణ కమిటీ నిగ్గు తేల్చిందని టీఎన్జీవో సంఘం నగర శాఖ అధ్యక్షులు  శ్రీకాంత్ అన్నారు.  కోఠి డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని యూనిట్ సంఘం కార్యాలయంలో  సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. డీహెచ్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న  హరి అనే అధికారి లైంగిక వేధింపులకు పాల డటంతో పాటు రూ. 50వేలు లంచం తీసుకున్నారంటూ గత అక్టోబరులో జ్యోతి అనే జూనియర్ అసిస్టెంట్, న్యాయవాది పేరిట రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ కార్యదర్శి, మంత్రి కార్యాలయానికి ఆకాశరామన్న ఉత్తరం ద్వారా లీగల్ నోటీసు పంపించారు.

డీహెచ్ నియమించిన అంతర్గత విచారణ కమిటీ విచారణలో జ్యోతి పేరుతో ఉద్యోగిని లేరని, బార్ కౌన్సిల్లో న్యాయవాది శివసుబ్రమణ్యన్ పేరు లేదని గుర్తించిందని, హరిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని తేల్చిందని శ్రీకాంత్ వివరించారు. వ్యక్తిగత కక్షలు, యూనియన్ విషయంలో పడక కొందరు వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, వారిని గుర్తించి వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. రాజీపేట హరి మాట్లాడుతూ నిరాధార ఆరోపణతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు దేవదాస్, నగర నాయకులు ప్రభాకర్, తదితరు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -