Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంగారు వ్యాపారి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం 

బంగారు వ్యాపారి చేస్తున్న ఆరోపణలు అవాస్తవం 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్ 
తనపై బంగారు వ్యాపారి కోమన్ పల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కత్రాజీ విష్ణు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోమనపల్లి శ్రీనివాస్ కు తాను ఎటువంటి డబ్బులు ఇచ్చేది లేదని, ఇద్దరం కలిసి వ్యాపారం నిర్వహించామని, తండ్రి ఆరోగ్య పరిస్థితిలో దృశ్య తాము హాస్పిటల్కు తిరగవలసి వస్తుందని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తూ, ఇదివరకే పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారని అన్నారు.

పోలీసులకు, సీపీకి తమపై వచ్చిన ఫిర్యాదుకు పూర్తిగా జవాబు ఇచ్చామని, అయినా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు చెల్లించాలని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, దాడులు సైతం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. బొంబాయి కి చెందిన బంగారు వ్యాపారితో వ్యాపారం చేసి నష్టపోయి తమపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. పట్టణంలో కోమన్ పల్లి శ్రీనివాస్ నకిలీ  హలోగ్రామ్ తో బంగారు వ్యాపారం చేస్తాడని ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -