సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ – తుంగతుర్తి
సామ్రాజ్యవాద విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు అన్నారు. శనివారం రెడ్ బుక్ డే సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తకం పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రపంచంలో ఉన్న దేశాలు స్వతంత్రత సార్వభౌమత్వం కలిగి ఉండాలని ఉద్దేశంతో వివిధ దేశాలు తాము రచించుకున్న రాజ్యాంగం ప్రకారం నడుస్తుంటే ఓర్వలేని అమెరికా సామ్రాజ్యవాదం తన గుత్తాధిపత్యం కోసం వివిధ దేశాల మీద దాడులు చేసి ఆ దేశంలో ఉన్న ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ సామ్రాజ్యవాద విధానాన్ని చాటుకుంటుందని దాని అడ్డుకోవడం సోషలిజం వల్లనే అవుతుందని అన్నారు. అమెరికా తన ఆధిపత్యం కోసం చిన్న దేశాలైన వెనిజులా అధ్యక్షున్ని అతని భార్యను బంధించి ఆదేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేశాడని విమర్శించారు
వెనుజులా దేశంలో చమురు ఎగుమతిని వివిధ దేశాలకు తక్కువ సుంకంతో అందిస్తున్నాడని, తాను చెప్పినట్లు ఆ దేశ అధ్యక్షుడు వినాలని నిర్ణయాన్ని విభేదించిన దేశ అధ్యక్షుని బంధించడం హేయమైన చర్యని అన్నారు. మన దేశానికి కూడా శుంకాలను పెంచి రష్యా దేశం నుంచి దిగుమతి చేయకుండా అమెరికా దేశం నుండి దిగుమతి చేయాలని షరతులు పెట్టిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అతనికి వత్తాసుగా అగ్రిమెంట్ చేసుకున్నాడని విమర్శించారు. ఇజ్రాయిల్ దేశం గాజా పై దాడులను ప్రోత్సహించి ఆ దేశ భౌతిక స్వరూపం పై తీవ్రమైన దెబ్బతీశాడని అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ముఖ్యమైన నగరాలు దగ్ధమయాయని దీనికంతటికి అమెరికా కారణమని అన్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు వివిధ దేశాల అంతర్గత విషయాలలో భద్రతా విషయాలలో జోక్యం చేసుకొని తన పెత్తనం ఆదేశాలపై రుద్దుతున్నాడని అన్నారు.
అందుకే సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా సోషలిస్టు దేశాలైన రష్యా క్యూబా ఉత్తరకొరియా దేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ముందు నిలుస్తున్నాయని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా పెత్తనం చెలాయిస్తూ తన గుత్తాధిపత్యం నడవాలని చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు, కందాల శంకర్ రెడ్డి మండల కార్యదర్శిలు వజ్జే శ్రీనివాసు, దేవరకొండ యాదగిరి మాజీ జడ్పిటిసి తాటి విజయమ్మ మండల కమిటీ సభ్యులు దేవరాజు,ఉప్పుల సోమయ్య, బోనాల వెంకన్న, సైదులు,యాదగిరి,చంద్రయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.



