నవతెలంగాణ – జడ్చర్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాపూర్ నందు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్, జడ్చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెట్లను పెంచి పర్యావరణo కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈవో విద్యార్థులకు సూచించారు. చెట్లు బతికినన్ని రోజులు నీడనిచ్చి పూలనిచ్చి ఫలములు ఇచ్చి, చనిపోయిన తర్వాత కూడా చెట్లు మానవాళికి ఉపయోగపడుతున్నాయని అన్నారు.
అవి మనందరికీ గురువు లాంటివని జడ్చర్ల సిఐ కమలాకర్ సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతప్ప మాట్లాడుతూ… విద్యార్థులు చిన్నప్పటినుంచి చెట్లను కాపాడడం, ప్రకృతిని కాపాడడం తమ బాధ్యతగా భావించాలని అన్నారు. దాదాపు పదివేల రూపాయల విలువ గల చెట్లను నాటడానికి ముందుకు వచ్చిన కరాటే మాస్టర్ కేశవులును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ సీఎంఓ బాలు యాదవ్ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.
మానవాళికి తరువులే గురువులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES