మార్చి వచ్చిందంటే మూర్చ వఛ్చినంత పని
జీతం పన్ను ఎగుర వేసుకుని పోతదని
కోత కోసిన పంట కళ్ల ముందే ఎత్తుకు పోయినట్లు
ఉద్యోగి ఆదాయం అద్దం లో తేట తెల్లగా
గంప కింద దాచేది గురువింజ గింజంత లేదు
ఫారం పదహారు పక్కగా పద్దులు పరిచి పెట్టి
ఏ సెక్షన్‌లో ఎంత వెసులు బాటు ఎతికిన
టాక్స్ గాడి వలకు చిక్కక తప్పదు కదా
ఇంటికి పట్టుకు వెళ్ళేది పట్టుమని పదిశాతం
కొత్త కొత్త పద్ధతులు తెచ్చి వింత వింత లెక్కలు
జీతం లక్ష దాటితే లక్షణంగా దొరికినట్లే
రంపం ఒకటి రయ్యిన ముక్కలు ముక్కలుగా
పన్ను కట్టడం దేశ భక్తి ప్రకటించుకోవడమే కాని
కష్టాల్లో వున్నప్పుడు కనికరించదు కదా ప్రభుత్వం
చదువులకు దావఖానాకు చదివింపులు ఎన్నెన్నో
బడ్జెట్ వఛ్చినప్పుడల్లా పక్షి చూపులు పెద్దగా
సామెతలు గొప్పగా చెప్పి వెనుక చప్పట్లు గట్టిగా
వేతన జీవులకు మాత్రం వేదననే మిగిల్చి…..
దాసరి మోహన్, 9985309080
వేతన జీవి వేదన…
- Advertisement -
- Advertisement -



