Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు పట్టుకున్న అడవి జంతువుల భయం..

రైతులకు పట్టుకున్న అడవి జంతువుల భయం..

- Advertisement -

ఆందోళన చెందుతున్న రైతులు 
నవతెలంగాణ – సదాశివనగర్ 

మండలంలోని రైతులు ఆడవి జంతువులతో నానా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అడవి జంతువులు పందులు కోతులు, ముళ్ళ పందులు ,జింకలు కంటినిండా కునుకు లేకుండా చేస్తున్నాయని తెలిపారు. ఎంతో కష్టపడి పంట పెట్టుబడి పెట్టి, పంటలు పండిస్తున్నా.. ఈ జంతువుల వల్ల పంట చేతికొస్తుందన్న నమ్మకం లేకుండా పోయిందని అన్నారు. ఓవైపు భారీ వర్షాలతో కొట్టుకుపోయిన పంటలు.. మరో వైపు ఆడవి జంతువులతో మా పరిస్థితి ఘోరంగా ఉందని అన్నారు. కంటి రెప్పలా పంటను కాపాడుకుంటున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురైందని వారు వాపోయారు. వెంటనే ఆటవి శాఖ అధికారులు స్పందించి, జంతువుల పైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నష్టపోయిన రైతులకు అటవీశాఖ ద్వారా నష్ట పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -