Monday, February 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమ కారులను ఆదుకుంటామనే ప్రకటన హర్షనీయం.!

ఉద్యమ కారులను ఆదుకుంటామనే ప్రకటన హర్షనీయం.!

- Advertisement -

సీఎంతోపాటు, మంత్రులకు కృతజ్ఞతలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉద్యమ కారుల హామీలను నెరవేర్చుతామని అందుకు ఈ నెలాఖరులోగా సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఇటివల నిజామాబాద్ లో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు ప్రకటన చేయడం హర్షనీయమని టియూఎఫ్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల లో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం (టియూఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించి మాట్లాడారు.

ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ కారులను ఆదుకుంటామని మానిఫేస్టోలో ఆరు గ్యారంటీల్లో ఆరవ హమీగా ఉద్యమకారుల అంశాన్ని పెట్టి నేడు అమలు చేయడానికి ఒక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన చేయడం పట్ల ఉద్యమ కారులు హాసార్ధం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ళుగా టియూఎఫ్ ఫోరం అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ నేతృత్వంలో అనేక పోరాటాలు విజ్ఞప్తులతో ప్రభుత్వం గుర్తించేందుకు ప్రకటన చేయడం హర్షనీయమని సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమంలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి, మానిఫేస్టో కమిటీ చైర్మన్ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కేబినెట్ మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టియూఎఫ్ మండల అధ్యక్షులు బూడిద సతీష్, ఉద్యమ కారులు బడితల వెంకటస్వామి, చొప్పరి రాజు, షేక్ చాంద్ పాష, కోండ్ర సారయ్య, ఆకుల రాజేశం, ఆకుల సదానందం, మద్దుల విజయ, జునగరి పద్మ, సమ్మయ్య, రవి,కిష్టయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -