భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి..
అధికారులు, పాలకమండలి సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
నియోజకవర్గంలోని పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలిసిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబర్ 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తాలకమండలి సభ్యులకు అన్ని శాఖల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శ్రీ పద్ధతి ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలి.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్, మొదలైన వాటిపైన అధికారులు ఇప్పటినుండే దృష్టి పెట్టి భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. దేవాలయం ఆవరణంలో త్వరలోనే సెల్ ఫోన్ టవర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులందరికీ సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ రాములు నాయక్ , ఈవో, పాలకమండలి డైరెక్టర్లు అన్ని విభాగాల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


