Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుంతలమయంగా ఆర్మూర్-నందిపేట్ రోడ్డు

గుంతలమయంగా ఆర్మూర్-నందిపేట్ రోడ్డు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఆర్మూర్, ఆలూర్, నందిపేట్ గ్రామాల మధ్య ఉన్న రహదారి మృత్యు కూపంగా మారింది. ముఖ్యంగా, నడిరోడ్డుపై ఏర్పడిన భారీ గొయ్యి కారణంగా నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు బోల్తా పడే ప్రమాదం ఉంది. దీంతో భారీ గొయ్యిలో స్థానికులు కొన్ని చెట్ల కొమ్మలను, సంచిలను  ప్రమాద సూచిక బోర్డులాగా పెట్టారు. ఈ దుస్థితితో అధికారులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అగి మీద గుగిలమవుతున్నారు.

రాణాలు అరచేతిలో పెట్టుకుని
ప్రస్తుతం ఆర్మూర్- నందిపేట్, ఆలూర్ – వెల్మల్ రోడ్డు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రోడ్డు మధ్యలో ఏర్పడిన లోతైన గొయ్యి , మరియు గొయ్యి చుట్టుపక్కల పేరుకుపోయిన ఇసుక ఆగిన నీళ్లు వాహనదారులకు అస్సలు కనిపించక, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యం ప్రయాణించే ప్రభుత్వ బస్సులు ఈ గుంతల్లో ఇరుక్కుపోయి, పక్కకు ఒరిగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోనన్న భయంతో స్థానికులు బిక్కు బిక్కుమంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..
రోడ్డుపై ప్రమాదకరమైన గొయ్యి ఏర్పడినా, మరియు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన   అధికారులు ఇప్పటికీ పట్టించుకోకపోవడం స్థానికుల్లో ఆగ్రహం పెంచుతోంది. యుద్ధప్రాతిపదిన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు తక్షణమే కలుగజేసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక ప్రజలు,ప్రయాణికుల రక్షణ దృష్ట్యా, జిల్లా అధికారులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన రోడ్డు రహదారికి మరమ్మతులు చేపట్టి  ప్రజలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని గట్టిగా కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గానీ, సంబంధిత రోడ్లు, భవనాలశాఖ అధికారులుగానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -