నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో సమయం దాటి వ్యాపార కార్యకలాపాలు సాగించిన హోటల్ నిర్వాకుడిని అరెస్టు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి గురువారం తెలిపారు.ఈ నెల 21వ తేదీన మధ్య రాత్రి వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన గ్లామర్ హోటల్ కు (తిలక్ గార్డెన్ దగ్గర )చెందిన ఎండి. అర్షదుద్దీన్ ని ఈ రోజు స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ముందు హాజరు పరచగా ఆ వ్యక్తికి ఒక్క రోజు జైలు శిక్ష విధించారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇతని జైలుకు పంపించినట్లు తెలిపారు. ఎవరైనా వ్యాపార సమయం తరువాత షాప్ లు/ హోటల్ లు/ పాన్ షాప్ లు మరే ఇతర షాప్ లు తెరిచినచో వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సమయం దాటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన హోటల్ నిర్వాకుడు అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES