నవతెలంగాణ – భీంగల్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 600 రోజులు అయిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని, ప్రజా పాలనను గాలికోదిలేసి, నీచ రాజకీయాలు చేస్తున్నారని భీంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలుపై ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రశాంత్ రెడ్డి మాటలను తప్పుడు మాటలని గల్ఫ్ లో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదని మీరు 17 తేదీన చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డికి సవాళ్లు విసురుతూ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భీంగల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొనకంటి నర్సయ్య మాట్లాడుతూ… ఆ సవాళ్లకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిసి, భీంగల్ మండలంలోని ముఖ్య కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినారు.మిగిలిన కార్యకర్తలు, నాయకులు అందరూ వేల్పుర్ లో రెడీగా ఉన్నారని, మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నా వేల్పూర్ కి వస్తే మీ సవాళ్లకు ప్రతి సవాళ్లు, జవాబులు ఇవ్వాలని అన్నారు. మోహన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారో తెలియడం లేదని అన్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేసిందనడానికి నిదర్శనం ఎంతమంది గల్ఫ్ బాధితులకు మీరు ఐదు లక్షలు ఇచ్చిండ్రో చెప్పాలని మేము ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దీంతోపాటు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినారు వారిని కూడా వేల్పూర్ కి తీసుకురా మోహన్ రెడ్డి రాని రైతులను మేము కూడా వేల్పుకు తీసుకొస్తాం. అదేవిధంగా ఎంతమంది రైతులకు రైతుబంధువు ఇచ్చిండ్రు వారిని కూడా తీసుకురా, రాని వారిని మేము కూడా తీసుకువస్తాం అంటూ, ఎంత మంది ఆడబిడ్డలకు తులం బంగారం ఇచ్చినారు వారిని కూడా తీసుకురా ఒక్కరికి కూడా ఇయ్యలేరు మేమందరిని తీసుకొస్తాం ఎంతమంది చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చినారు ఒక్కరి కూడ ఇయ్యలేరు వారిని కూడా తీసుకురా మోహన్ రెడ్డి. ఎంత మంది రైతులకు వడ్లకు బోనస్ ఇచ్చినారు, వచ్చిన వారిని నువ్వు తీసుకురా రాని వారిని మేము తీసుకొస్తాం మోహన్ రెడ్డి . వృద్ధాప్య పెన్షన్లను 4,000/- ఎంతమందికి ఇస్తున్నారు. వారిని కూడా తీసుకురా వికలాంగుల పెన్షన్ 6000/- పెంచుతామన్నారు.
ఎంత మందికి ఇస్తున్నారు వారిని కూడా తీసుకురా మేము రీడిగా ఉన్నాం. సిగ్గు మాలిన మాటలు నియ్యి, గ్లోబల్ ప్రచారం నీది, అవినీతి ప్రచారం నీది, పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ప్రశాంత్ రెడ్డిపైన మా నాయకుల పైన ఊరుకునేది లేదు. ఈ ప్రాంతంలో నిన్ను తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరించారు. అరెస్ట్ అయినవారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, శర్మ నాయక్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిన్న శోభన్, చింతకింది భూమేష్, తక్కూరి రాజేందర్, గున్నాల భగత్,వెల్దుర్తి కిషన్, మూత లింబాద్రి, ఒరగంటి డిష్ గంగాధర్,మోర్తాడు బద్రి, ఎర్రోళ్ల సంజీవ్, బండారి గంగాధర్. రాగి నరసింహ చారి, సిద్ధపల్లి రాములు, తదితరులు పాల్గొన్నారు.