Sunday, July 20, 2025
E-PAPER
Homeజాతీయంఏపీ మద్యం స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

ఏపీ మద్యం స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

- Advertisement -

లిక్కర్‌ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరాపై ఆరా
ఏడుగంటల పాటు విచారణ
విజయవాడ:
ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టయ్యారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన్ను సిట్‌ అరెస్ట్‌ చేసింది. విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో సుమారు 7 గంటలపాటు విచారించిన అనంతరం ఎంపీని అరెస్ట్‌ చేసింది. ఆయన్ను అరెస్ట్‌ చేసినట్టు బంధువులకు సిట్‌ అధికారులు సమాచారమిచ్చారు.

ఏం జరిగింది..?
లిక్కర్‌ పాలసీ రూపకల్పన, డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరా తదితర అంశాలపై మిథున్‌రెడ్డిని సిట్‌ ప్రశ్నించింది. ఎవరెవరితో ప్రయివేట్‌ సమావేశాలు నిర్వహించారనే దానిపై ఆరా తీసింది. డొల్ల కంపెనీల నుంచి సొమ్మును అంతిమ లబ్దిదారునికి చేర్చిన విధానంపై సిట్‌ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్‌ విధానంలోకి తీసుకురావడంలో మిథున్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిట్‌ గుర్తించింది. ఇప్పటికే మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -