Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుమ్మెరలో పసికందు మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలి

కుమ్మెరలో పసికందు మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ 
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో దేవుడి దర్శనానికి వెళ్లిన చాకలి మౌనిక–గణేష్ దంపతుల రెండునెలల పసికందు మృతి చెందడం, కుటుంబంపై దాడి జరగడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు నిరసనగా రజక, దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాయపోల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాసంపల్లి రాజు , రాజక సంఘం నాయకులు గౌరిగారి పర్షరాములు మాట్లాడుతూ కుమ్మెర ఘటనలో రజక కుటుంబంపై జరిగిన దాడి, పసికందు మృతి చెందడం అమానుషమని ఖండించారు. కుల వివక్షత ఎక్కడుంది అనే మూర్కులు సమాధానం చెప్పాలి.

హిందువులే హిందువుల పై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.9 మంది నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీర్లపల్లి రవి, చింతకింది కరుణాకర్, చెప్పాల స్వామి, మహేష్, స్వామి, నవీన్, షాదుల్లా, నరసింహ చారి, వెంకటేశం, బాబు, ప్రవీణ్, చక్రి, వీరేశం,మల్లయ్య, శివ, మహేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -